Header Banner

కూల్ గా ఉండే సౌత్ ఇండియన్ సమ్మర్ ప్లేసెస్ చూసొద్దామా! ఈ వేసవికి బెస్ట్ డెస్టినేషన్‌లు ఇవే!

  Sat Mar 01, 2025 14:59        Travel

వేసవి వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. చల్లని ప్రదేశాలకు వెళ్ళి సేద తీరడానికి అనువైన సమయమిది.తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో ఉండే చల్లని ప్రదేశాలకు వెళ్ళి Delay పదిరోజులు గడిపితే చాలు హాయి అలవికానిది. ఎండాకాలం ఒకేచోట గడిపితే అందం, ఆనందం వేరు. ఎలాగో వెళ్ళాలనుకున్నప్పుడు పకడ్బందీ ప్లాన్, రిజర్వేషన్లు చేయించుకోకుండా వెళ్ళడం సులువు కాదు. చల్లని ఆతిథ్యానికి ఉత్తర భారతమే కాదు దక్షిణాదిన అనేక వేసవి విహారాలున్నాయి. కూల్ కూల్ గా ఉండే సౌత్ ఇండియన్ సమ్మర్ ప్లేసెస్ చూసొద్దామా వేసవి అంటే చల్లని విడిదే కావాలంటారు. మండే ఎండల్లో చల్లని హిమాలయాల్లో తిరిగి రావడమే సమ్మర్ డేస్లో ట్రావెలర్స్ కు ఇష్టం. చాలా మంది కోరుకునేది కూడా అదే. ఆంధ్రప్రదేశ్ ..తమిళనాడు... కేరళ కర్ణాటకలో కూడా కొన్ని ప్రాంతాలున్నాయి. తెలుగు సరిహద్దులు దాటి దేశాంతరం వెళ్ళిన అనుభూతికి లోను కావాలంటే ఈ చల్లటి ప్రదేశాలకు వెళ్ళి రావడమే ఉత్తమం...


ఇది కూడా చదవండి: 2026 తర్వాత పెరిగే లోక్ సభ సీట్లివే ? రాష్ట్రాల వారీగా ఇలా..!


అరకు వ్యాలీ (ఆంధ్రప్రదేశ్): కాఫీ లవర్స్ కు ఇది స్వర్గం కాఫీ తోటలు, ఆ తోటల మధ్య దారులు, ఎత్తయిన కొండలు, దారి ప్రయాణంలో అక్కడక్కడా కనిపిస్తాయి. ఆదివాసీల గూడేలు చూసి రావచ్చు.. జూలై వరకు ఈ ప్రాంతం పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. అరకు ఆర్ట్ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం, కాపీ మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్, చాపరాయి వాటర్ ఫాల్స్ తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.
వట్టనకల్ (తమిళనాడు); దక్షిణ భారత దేశంలో వేడి ఎక్కువగా ఉన్నరోజుల్లో కూడా ఇక్కడ చల్లగా ఉంటుంది. వట్టనకల్ చూసి వస్తే ఇజ్రాయెల్ ని చూసినట్లే ఉంటుందట. అందుకే దీనిని ..లిటిల్ ఇజ్రాయెల్ ఆఫ్ ఇండియా.. అని కూడా అంటారు. వట్టనకల్ షోల నర్సరీని కూడా చూసి రావచ్చు..
కొడైకెనాల్ ( తమిళనాడు); వేసవిలో మొదలయ్యే పర్యాటకుల హడావిడి జూలైలో బాగా ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడి ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి. పచ్చని అడవి మధ్య అక్కడ ఉంటే రాతి గుట్టలు, సెలయేటి ప్రవాహాలు, జలపాతాలు పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి. కొడైకెనాల్ ను అడవులిచ్చిన కానుక అంటారు. ఇక్కడ మ్యూజియాలు, ఆలయాలు చాలా ప్రసిద్ధిగాంచినవి. విశాలమైన చెరువులు, డెవిల్స్ కిచెన్, బేర్ షోలా ఫాల్స్ కొడై చెరువు, పిల్లర్ రాక్స్, కోకర్స్ వాక్, ధలైయర్ ఫాల్స్, బెరిజామ్ టేక్, కురుంజి ఆలయం తప్పక చూడండి రావాల్సినవి.


ఇది కూడా చదవండి: క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు 25 కోట్లకు టోకరా.. కట్ చేస్తే.. తమన్నా, కాజల్‌ను విచారించనున్న పోలీసులు!


పొన్ముడి హిల్స్.(కేరళ): అడ్వెంచర్. ఆహ్లాదం కోసం ఇక్కడికి పోయి రావాలి... దీనిని ట్రెక్కర్స్ ప్యారడైజ్ అని కూడా పిలుస్తారు. ఎండలు మండే మే నెలలో దక్షిణ భారత దేశ పర్యాటకులకు అనువైన ప్రదేశం ఇది కొండ ప్రాంతమైన పొన్యుడి పట్టణం సుగంధ ద్రవ్యాల తోటలకు ప్రసిద్ధి . సుగంధ ద్రవ్యాల తర్వాత కాపీ తోటలు అధికంగా ఉంటాయి. ఈ కొండ ప్రాంతాలు ట్రెక్కర్స్ కు అనుకూలంగా ఉంటాయి. గోల్డెన్ పెప్పరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు దీనికి సమీపంలో ఉన్నాయి. ఇక్కడ జరిగే అరణ్మల ఆలయ ఉత్సవం ఎంతో ప్రసిద్ధి. వైల్డ్ లైఫ్ సఫారీ కోసం ఇక్కడికి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు..
ఇడుక్కి.(కేరళ); ఇక్కడ అతి పెద్దదైన ఆర్క్ డ్యామ్ ఇక్కడ ఉంది. ఇక్కడి చెరువుల్ని పర్యాటకులకు కనువిందు చేస్తుంది. కొండలపై ప్రయాణం మంచి అనుభూతినిస్తుంది. ఈ ప్రయాణంలో ఫ్యాక్టరీలు రబ్బరు తోటలు చూసిరావొచ్చు. ఇడుక్కి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, వయినావు జలపాతం, తొమ్మనుకుంటు జలపాతం, ఇడుక్కి ఆర్చ్ డ్యామ్, కాఫీ తోటలు, గులాబీ తోటలు, కులమాపు డ్యామ్ ప్రాంతంలో చూడదగినవి. ఎలిఫెంట్ రైడ్స్ ఇక్కడే స్పెషల్.
గోకర్ణ (కర్ణాటక) : అందమైన బీచ్ లు.. అద్భుతమైన శిల్పాలతో ఉండే ఆలయాలకు ఇది ప్రసిద్ధి. గోవాలో ఉన్నట్లే ఈ చిన్న పట్టణానికి సమీపంలో చాలా బీచ్ లు ఉన్నాయి. రిలాక్స్ గా ఉండేందుకు ఇక్కడ అనువైన సౌకర్యాలు. ఈ ప్రాంతంలో ఉన్న సందర్భంలో మహాబలేశ్వరం ఆలయం కూడా చూసి రావచ్చు. స్థానిక బీచ్లలో బోటింగ్ సదుపాయం ఉంది. సమీపంలోని ప్రాంతం, కొండ ప్రాంతాల ట్రెక్కింగ్కు పోయి రావచ్చు. స్థానిక సంతలు కూడా చూసి రాదగిన ప్రదేశాలు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #vaccations #summer #trps #places